: పాకిస్థాన్ ప్రధానిని కలవడం గర్వంగా ఉంది: డొనాల్డ్ ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సౌదీ అరేబియా పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. నిన్న రియాద్‌లో జరిగిన అరబ్ ఇస్లామిక్ అమెరికన్ సదస్సులో పాల్గొన్న డొనాల్డ్ ట్రంప్ ఈ సందర్భంగా ఆ కార్యక్రమానికి వచ్చిన పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్‌తో కాసేపు మాట్లాడారు. షరీఫ్‌తో కరచాలనం చేసి, ఆయనకు స్వాగతం పలికిన ట్రంప్.. అనంతరం మాట్లాడుతూ షరీఫ్‌ను కలవడం గర్వంగా ఉందని చెప్పారు. షరీఫ్ కూడా తనను కలవడం పట్ల ఇలాగే భావిస్తున్నారని అన్నారు. అరబ్, ముస్లిం నేతలనుద్దేశించి ప్రసంగించిన ట్రంప్... ఉగ్రవాదంపై వారంతా పోరాడాలని హితవు పలికారు. మరోవైపు ట్రంప్ పాక్ పై పరోక్షంగా విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో షరీఫ్‌ని కలవడం గర్వంగా ఉందని వ్యాఖ్యానించడం గమనార్హం.