: ఏడుగురి దారుణ హత్యకు కారణమైన వాట్సాప్!


వాట్సాప్ దెబ్బకు ఏడుగురు దారుణ హత్యకు గురయ్యారు. వివరాల్లోకి వెళ్తే, పిల్లలను కొందరు వ్యక్తులు ఎత్తుకుపోతున్నారని, పిల్లల శరీర భాగాలను అమ్మేస్తున్నారని వాట్సాప్ లో వదంతులు వ్యాపించాయి. దీంతో, రెండు గ్రామాలకు సంబంధించిన వ్యక్తులు కొందరిని పట్టుకుని దారుణంగా కొట్టారు. ఈ ఘటనలో ఏడుగురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. ఈ దారుణ ఘటన జార్ఖండ్ లోని సింగ్ భూమ్ జిల్లాలో జరిగింది.

ఈ కేసుకు సంబంధించి 19 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు, పోలీసులకు మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. బాష్పవాయు గోళాలను ప్రయోగించారు. ఈ సందర్భంగా ఓ పోలీసు అధికారి మాట్లాడుతూ, ఇలాంటి దారుణ ఘటన ఇంతకు ముందెన్నడూ జరగలేదని అన్నారు. సాధారణంగా ఈ ప్రాంతంలో ఉండే గిరిజనులు చాలా ప్రశాంతంగా ఉంటారని... అయితే, వాట్సాప్ లోని రూమర్లు వీరిని తీవ్ర భయాందోళనలకు గురి చేశాయని... ఈ ఘటనకు కారణం ఇదేనని చెప్పారు.

  • Loading...

More Telugu News