: ఐపీఎల్‌-10 రికార్డుల వీరుల వివరాలు


ఐపీఎల్-10వ సీజ‌న్ ముగిసింది. ఈ సీజ‌న్‌లో అత్య‌ధిక ప‌రుగులు చేసి సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ సారథి డేవిడ్‌ వార్నర్‌ ఆరెంజ్‌ క్యాప్ ద‌క్కించుకోగా, అదే జ‌ట్టు ఆట‌గాడు భువ‌నేశ్వ‌ర్ కుమార్ అత్య‌ధిక వికెట్లు తీసి ప‌ర్పుల్ క్యాప్ సొంతం చేసుకున్నాడు.

  • ఈ సీజ‌న్‌లో న‌మోదైన రికార్డుల వివ‌రాలు...
  • అత్యధిక పరుగులు - డేవిడ్‌ వార్నర్ (ముంబై ఇండియ‌న్స్ , 641 పరుగులు)
  •  ఒకే ఓవర్‌లో అత్యధిక పరుగులు- ముంబయి ఇండియన్స్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా ( 28 పరుగులు)
  • అత్య‌ధిక‌ సిక్సర్లు- పంజాబ్ జ‌ట్టు కెప్టెన్‌- గ్లెన్‌ మాక్స్‌వెల్ (13 ఇన్నింగ్సుల్లో 26 సిక్సర్లు)
  • ఎక్కువ అర్థశతకాలు- కోల్‌కతా కీపర్‌ రాబిన్‌ ఉతప్ప (13 ఇన్నింగ్సుల్లో 5)
  •  అత్యధిక వేగవంతమైన శతకం- వార్నర్ (43 బంతుల్లో 126 పరుగులు)
  • అత్యధిక వికెట్లు- సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ బౌలర్‌ భువనేశ్వర్‌ కుమార్ (14 ఇన్నింగ్సుల్లో 26 వికెట్లు)
  •  అత్యుత్తమ బౌలింగ్ ప్ర‌ద‌ర్శ‌న- గుజ‌రాత్‌ బౌలర్‌ ఆండ్రూ టై (పుణెపై 17 పరుగులిచ్చి 5 వికెట్లు)
  • అధిక పరుగులిచ్చిన బౌల‌ర్- ఢిల్లీ ఆట‌గాడు పాట్‌ కమిన్స్‌(ముంబైపై 4 ఓవర్లకు 59 పరుగులు)
  • అత్యంత వేగవంతమైన బంతి విసిరింది- ఢిల్లీ బౌలర్‌- ప్యాట్‌ కమిన్స్ (153.56 కిలోమీటర్ల వేగం)

                                         

  • Loading...

More Telugu News