: తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల..ఆంధ్రా విద్యార్థుల హవా!
తెలంగాణ ఎంసెట్ ఫలితాయి వెలువడ్డాయి. తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి ఎంసెట్ ర్యాంకులను విడుదల చేశారు. ఇంజనీరింగ్ లో 74.75 శాతం, వైద్య విద్యలో 86.49 శాతం ఉత్తీర్ణత సాధించినట్టు చెప్పారు. కాగా, తెలంగాణ ఎంసెట్ లో ఇంజనీరింగ్, అగ్రి, ఫార్మసీ విభాగాల్లో ఆంధ్రా విద్యార్థులు హవా చాటారు. ఇంజనీరింగ్ టాప్-10లో ఆరు ర్యాంకులు, అగ్రి, ఫార్మసీ విభాగాల్లో మొదటి 10 ర్యాంకుల్లో ఐదు ర్యాంకులు సాధించారు.
ఇంజనీరింగ్ లో..
* మొదటి ర్యాంకు - గుంటూరుకు చెందిన జయంత్ హర్ష (156 మార్కులు)
* రెండో ర్యాంకు- శ్రీకాకుళం జిల్లాకు చెందిన రాంప్రసాద్ (156 మార్కులు)
* మూడో ర్యాంకు- భరద్వాజ్ (155 మార్కులు)
* నాలుగో ర్యాంకు- తూర్పు గోదావరి జిల్లా కు చెందిన శైలేంద్ర (155 మార్కులు)
* ఆరో ర్యాంకు- అనంతపురం జిల్లాకు చెందిన దిలీప్ కుమార్ (155 మార్కులు)
* తొమ్మిదో ర్యాంకు - కృష్ణా జిల్లాకు చెందిన అబ్దుల్ మూయిజ్ (154 మార్కులు)