: కేశినేని కామెంట్లను లైట్ గా తీసుకుంటున్నాం: కన్నా లక్ష్మీనారాయణ
బీజేపీతో పొత్తు వల్ల తాము నష్టపోయామని టీడీపీ ఎంపీ కేశినేని నాని చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ స్పందిస్తూ, కేశినేని చేసిన వ్యాఖ్యలను తాము లైట్ గా తీసుకుంటున్నామని, ఇది పార్టీ అభిప్రాయోమో, కేశినేని వ్యక్తిగత అభిప్రాయమో చంద్రబాబు తేల్చాలని డిమాండ్ చేశారు. ఇటువంటి వ్యాఖ్యలు చేయడం టీడీపీ నాయకులకు అలవాటేనని అన్నారు. టీడీపీ నాయకులు అలాంటి వ్యాఖ్యలు చేయగానే తాము ఖండించడం, ఆ తర్వాత చంద్రబాబు వారిని దండించడం షరా మామూలేనని అన్నారు. ఇదంతా ఓ నాటకంలా ఉందని కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు.