: వెంకయ్య చాలా క్లియర్ గా చెప్పారు.. పార్టీల పీఠాలు కదిలిపోతాయ్: సోము వీర్రాజు
రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చని ఏపీ బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. ఒక్క పరుగు తేడాతో ఐపీఎల్ లో ముంబై గెలిచిందని... రాజకీయాల్లో కూడా ఏదైనా జరగొచ్చని చెప్పారు. తమ పార్టీని తాము బలపరుచుకోవడం సహజమైన ప్రక్రియ అని చెప్పారు. ప్రధానితో జగన్ భేటీ కావడాన్ని కొందరు విమర్శిస్తుండటం వారి అవగాహనా రాహిత్యం అని... 2019 వరకు టీడీపీతో పొత్తు అని, ఆ తర్వాత మరేదైనా జరగొచ్చని వెంకయ్యనాయుడు చాలా క్లియర్ గా చెప్పారని... ఇక ఇంతకన్నా చెప్పాల్సింది ఏముందని అన్నారు.
ప్రధాన మంత్రిని ఎవరైనా కలవచ్చని... చంద్రబాబును కూడా ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు చాలా సార్లు కలిశారని... తమ సమస్యలను చెప్పుకోవడానికి నేతలంతా ముఖ్యమంత్రిని కలవడం సహజమేనని చెప్పారు. రానున్న రోజుల్లో ఏపీలో బీజీపీ పూర్తి స్థాయిలో బలపడటాన్ని అందరూ చూస్తారని అన్నారు. బీజేపీలో చేరేందుకు యాక్టర్లు, రైటర్లు, పెద్ద మనుషులు చాలామంది రెడీగా ఉన్నారని... ఇతర పార్టీల పీఠాలు కదిలిపోతాయిని చెప్పారు.