: తమిళ మంత్రికి చుక్కలు చూపించిన వీధి కుక్కలు!
తమిళనాడు రాష్ట్ర మంత్రి సెల్లూర్ రాజాకు వీధి కుక్కలు చుక్కలు చూపించాయి. వివరాల్లోకి వెళ్తే, మధురైలోని ఎకో పార్కులో రెండు రోజుల క్రితం ఆయన మార్నింగ్ వాక్ చేస్తున్నారు. ఆయనతో పాటు ఆయన సతీమణి కూడా ఉన్నారు. వారిద్దరూ తమ పెంపుడు కుక్కను కూడా తీసుకెళ్లారు. వారు పార్కులోకి వెళుతున్న సమయంలో... మంత్రిగారి కుక్కను చూసి వీధి కుక్కలు మొరుగుతూ పార్కులోకి ప్రవేశించాయి. ఈ సందర్భంగా మంత్రిగారి కుక్క కూడా వీధి కుక్కలను చూసి మొరగడం ప్రారంభించింది. దీంతో, వీధి కుక్కల్లో ఆగ్రహం మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో, వీధి కుక్కలను తరిమేందుకు సెల్లూర్ రాజా ప్రయత్నించడంతో... కుక్కలన్నీ ఆయనపైకి వెళ్లబోయాయి. దీంతో, భద్రతా సిబ్బంది అలర్ట్ అయ్యారు. ఆ కుక్కలను అక్కడి నుంచి తరిమేశారు.