: ‘మేరా నామ్ జోకర్’ నుంచి ‘102 నాటౌట్’ వరకు అంటున్న రిషికపూర్


బాలీవుడ్ సీనియర్ నటుడు రిషికపూర్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారనే విషయం తెలిసిందే. తన అభిప్రాయాలను ఎప్పటికప్పుడు సామాజిక మాధ్యమాల ద్వారా షేర్ చేసుకుంటూ ఉండే రిషికపూర్, తాజాగా, ఓ రెండు ఫొటోలను పోస్ట్ చేశారు. ఆ రెండు ఫొటోల్లో ఒకటి తన సినీ కెరీర్ మొదలైనప్పటిది కాగా, రెండో ఫొటో.. తన తాజా చిత్రం ‘102 నాటౌట్’ లోది. కాగా, ‘మేరా నామ్ జోకర్’లో బాలనటుడిగా తన సినీ ప్రస్థానాన్ని రిషికపూర్ ప్రారంభించారు. తాజాగా ‘102 నాటౌట్’ చిత్రంలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కు కొడుకు పాత్ర (డెబ్భై రెండేళ్ల వృద్ధుడిగా) లో రిషికపూర్ నటిస్తున్నారు. ఈ సందర్భంగా బాలనటుడిగా, వృద్ధుడిగా ఉన్న తన ఫొటోలను రిషికపూర్ పోస్ట్ చేశారు. 

  • Loading...

More Telugu News