: ప్రధాని మోదీని కలవనున్న రజనీకాంత్?
దేవుడు ఆదేశిస్తే తాను రాజకీయాల్లోకి వస్తానని చెప్పిన తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ వారంలో ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నట్టు సమాచారం. త్వరలోనే ప్రధాని నరేంద్ర మోదీని కలవనున్నారని, ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లూ సాగుగుతున్నాయని సమాచారం. రజనీకాంత్ రాజకీయ రంగప్రవేశం, రానున్న నెలల్లో రాజకీయ వేదిక ప్రారంభించడం, తీసుకోవాల్సిన చర్యలు మొదలైన అంశాలు మోదీ-రజనీ భేటీలో ప్రస్తావనకు రానున్నట్టు సమాచారం. కాగా, రజనీకాంత్ తన అభిమానులను ఇటీవల కలిసిన విషయం తెలిసిందే. ‘యుద్ధమంటూ వస్తే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి’ అని తన అభిమానులకు ఈ సందర్భంగా ఆయన పిలుపు నిచ్చారు. రజనీ ఢిల్లీ పర్యటన నేపథ్యంలో ఆ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకోవడం గమనార్హం.