: నేటి నుంచి తెలంగాణలో పర్యటించనున్న అమిత్ షా


తెలంగాణలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మూడు రోజుల పర్యటన నేటి నుంచి ప్రారంభం కానుంది. ఈ రోజు ఉదయం 11.15 గంటలకు హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయంలో ఆయన దిగుతారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా నల్గొండ జిల్లా చండూరు మండలం తెరటుపల్లి గ్రామానికి వెళ్లి, అక్కడ  పార్టీ పతాకాన్ని ఎగురవేస్తారు. ఇక్కడి నుంచి అమిత్ షా పర్యటన ప్రారంభం అవుతుంది. కాగా, పార్టీ కోసం ప్రాణ త్యాగం చేసిన గుండగోని మైసయ్య గౌడ్ విగ్రహాన్ని అక్కడ ఆవిష్కరించనున్నారు. నాడు తెలంగాణ సాయుధ పోరాటంలో రజాకార్ల దాష్టీకాలకు ప్రాణాలు కోల్పోయిన అమర వీరుల కుటుంబ సభ్యులను అమిత్ షా కలవనున్నారు. 

  • Loading...

More Telugu News