: సర్జికల్ దాడులు చేసిన తర్వాతే చెప్పాం..ఈసారీ అంతే!: కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్
పీఓకేలో సర్జికల్ దాడులు నిర్వహించిన తర్వాత, తమ పని పూర్తయిన తర్వాతే ఆ విషయాన్ని చెప్పామని, ఈ సారీ కూడా అంతేనని కేంద్రమంత్రి జితేంద్రసింగ్ ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఢిల్లీలో నిన్న నిర్వహించిన ‘ఇండియాటుడే ఎడిటర్స్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్’లో ఆయన పాల్గొన్నారు. ‘నియంత్రణ రేఖ అవతల ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం మరోసారి సర్జికల్ దాడులు నిర్వహించనుందా?’ అనే ప్రశ్నకు జితేంద్రసింగ్ పై వ్యాఖ్యలు చేశారు. తప్పకుండా, తిరుగులేని నిర్ణయాన్ని తీసుకుంటామని, అయితే, ఆ నిర్ణయం ఏంటనేది ఇప్పుడే చెప్పమని, అవసరమైన చర్యలను భద్రతా సంస్థలు తీసుకుంటాయని అన్నారు.