: ‘కెప్టెన్’ విజయ్ కాంత్ మళ్లీ అదే దూకుడు!
డీఎండీకే అధినేత విజయ్ కాంత్ అనారోగ్య కారణాలతో రెండు నెలలకు పైగా ఇంటికి, ఆసుపత్రికే పరిమితమైన విషయం తెలిసిందే. అయితే, ఇటీవలే కోలుకున్న విజయ్ కాంత్ ‘ప్రజలతో మమేకం’ అని ప్రకటిస్తూ నిన్న ప్రజల మధ్యకు వచ్చారు. శివగంగైలో పర్యటించారు. ఈ రోజు తిరునల్వేలిలో పర్యటించనున్నారు. అయితే, గతంలో ఎంతో అసహనంగా వ్యవహరించిన విజయ్ కాంత్ తీరులో ప్రస్తుతం ఏమాత్రం మార్పులేదు. అదే, దూకుడుగా మాట్లాడుతున్నారు.
తమ పార్టీ నాయకుడి ఇంట్లో శుభాకార్యానికి విజయ్ కాంత్ దంపతులు నిన్నహాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియా వర్గాలు ఆయన్ని చుట్టుముట్టాయి. అన్నాడీఎంకే లోని శిబిరాల గురించి ప్రస్తావించగా, పన్నీరు సెల్వం, పళనిస్వామి ఇద్దరూ వేస్ట్ అని, వారి ప్రస్తావన తేవద్దని తనదైన శైలిలో విజయ్ కాంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘అమ్మ సమాధి వద్ద కూర్చున్నాడంటా..నీ..’, ‘మళ్లీ కోపం వచ్చేస్తోంది’ అంటూ అసహనం వ్యక్తం చేశారు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం ఇంట్లో ఐటీ దాడుల ప్రస్తావన తీసుకురాగా, ‘ప్రజలకు ఉపయోగకరమైన, మంచి చేసే ప్రశ్నలు వేస్తే సమాధానాలు చెబుతా, లేకపోతే, వెళ్లిపోతా’ అంటూ మండిపడ్డారు.

ரஜினிகாந்த் அரசியலுக்கு வந்தால் வரட்டும்; இரு அணிகள் பற்றி என்னிடம் பேச வேண்டாம்: விஜயகாந்த் #vijayakanth #Rajinikanth #RajinikanthFansMeet pic.twitter.com/NNs2dYoELH
— PuthiyathalaimuraiTV (@PTTVOnlineNews) May 20, 2017