: ‘నన్ను బియ్యం రెడ్డి’ అన్న రాజశేఖర్ రెడ్డిని ‘బాంబుల రెడ్డి’ అన్నాను: నాగం


ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్న సమయంలోనాగం జనార్దన్ రెడ్డిపై ఆరోపణలు రావడం, అప్పటి నుంచి ఆయన్ని ‘బియ్యం రెడ్డి’ అంటూ పలువురు విమర్శించడం తెలిసిందే. అయితే, నాటి విషయాన్ని ఓ న్యూస్ ఛానెల్ ఇంటర్వ్యూలో తాజాగా ప్రస్తావించడంతో ఆయన స్పందిస్తూ, "అప్పుడు, వైఎస్ రాజశేఖరరెడ్డి నన్ను ‘బియ్యం రెడ్డి’ అన్నాడు. అప్పుడు, నేను ఆయనని ‘నువ్వు బాంబుల రెడ్డివి’ అన్నాను. ‘ఒక్క బియ్యపు గింజ నేను మిస్ యూజ్ చేసినట్టు ఉంటే, నేను ముక్కు నేలకు రాస్తా, లేకపోతే, నువ్వు ముక్కు నేలకు రాయి అని’ నాడు ఛాలెంజ్ చేశాను" అంటూ చెప్పుకొచ్చారు నాగం. 

  • Loading...

More Telugu News