: నిజాం నవాబ్ కు వారసుడు కేసీఆర్: నాగం జనార్దన్ రెడ్డి
'నిజాం నవాబ్ కు వారసుడు కేసీఆర్, రాష్టానికి ఆయన నాయకత్వం వహించడం నాకు ఇష్టం లేదు' అని బీజేపీ నేత నాగం జనార్దన్ రెడ్డి అన్నారు. ఓ న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘రాబోయే రోజుల్లో అన్నిదారులు బీజేపీ ఆఫీసు వైపే. పార్టీ కార్యాలయం కళకళలాడుతుంది. యూపీ పాలసీనే తెలంగాణలో అమలు చేస్తాం. టీఆర్ఎస్ తో బీజేపీ పొత్తుకోరుకోదు. అవినీతికి వ్యతిరేకంగా నేను ఎప్పటి నుంచో పోరాడుతున్నాను. బినామీ ఆస్తులు కూడబెడుతున్న ఎంత మంది జైలుకు వెళ్తారో చూడండి’ అని చెప్పుకొచ్చారు.