: తండ్రిగా కాదు ప్రొడ్యూసర్ గా చెబుతున్నా... నా హీరో సూపర్!: చైతూపై నాగార్జున ప్రశంసలు
‘తండ్రిగా కాదు.. ఈ సినిమా ప్రొడ్యూసర్ గా చెబుతున్నా నా హీరో సూపర్’ అని తన కొడుకు నాగ చైతన్యపై అక్కినేని నాగార్జున ప్రశంసలు కురిపించారు. ‘రారండోయ్ వేడుక చూద్దాం’ చిత్రం ఆడియో రిలీజ్ వేడుకలో ఆయన పాల్గొన్నారు. ఈ చిత్రం ఆడియో సీడీలను ఆవిష్కరించిన అనంతరం నాగార్జున మాట్లాడుతూ, ‘ఈ సినిమాలో చక్కటి పల్లెటూరి పిల్లలాగా రకుల్ ప్రీత్ సింగ్ ఓణీలు వేసుకుంటుంది. ఈ సినిమాలో ఆమె పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఇక, కొడుకు గురించి తండ్రి ఎక్కువ పొగడకూడదు. మరి ఎలా? ఈ సినిమాకు నేను ప్రొడ్యూసర్ ని... ప్రొడ్యూసర్ గా చెబుతున్నాను.. నా హీరో సూపర్. చాలా బాగా చేశాడు. మీరు, ఎలా చూడాలనుకుంటున్నారో అలా చేశాడు. ఈ సినిమాలో కొత్త నాగచైతన్యను చూస్తారు.. అతనితో ప్రేమలో పడిపోతారు. మై హీరో సూపర్.. నేను శిల్పకళా వేదికలో ‘సోగ్గాడే చిన్నినాయన’ ఆడియో ఫంక్షన్ లో ఆ రోజు నేను ఏమన్నాను.. ఇప్పుడు మళ్లీ అదే చెబుతున్నా, వస్తున్నాం.. మళ్లీ కొడుతున్నాం..ఇది ఫిక్స్’ అని నాగార్జున హుషారుగా అన్నారు.