: చొరబడేందుకు యత్నించిన నలుగురు ఉగ్రవాదుల హతం!


భారత్ లోకి చొరబడేందుకు యత్నించిన నలుగురు ఉగ్రవాదులను మన జవాన్లు మట్టుబెట్టారు. ఉత్తర కాశ్మీర్ ప్రాంతంలోని నౌగమ్ సెక్టార్ పరిధిలో ఉగ్రవాదులు, జవాన్లకు మధ్య జరిగిన కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. భారత జవాన్లు ముగ్గురు వీర మరణం పొందారు. ఈ విషయాన్ని శ్రీనగర్ కు చెందిన ఆర్మీ అధికారి ఒకరు తెలిపారు. చొరబాటు దారుల నుంచి నాలుగు ఆయుధాలను, ఇతర యుద్ధ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

  • Loading...

More Telugu News