: 'ఎయిర్ లిఫ్ట్' రియల్ హీరో మాథ్యూ మృతి... ప్రముఖుల సంతాపం!


కువైట్ లో ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త మాథ్యూ మృతిపై కేరళ సీఎం పినరయి విజయన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మాథ్యూ తన జీవితాన్ని పణంగా పెట్టి భారతీయులను రక్షించారని, అన్నీ కోల్పోయారని, ఆయన చేసిన సేవలను ఎప్పటీకి మర్చిపోలేమని కేరళ ముఖ్యమంత్రి అన్నారు. కాగా, శుక్రవారం రాత్రి మాథ్యూ మరణించారు. కేరళ లోని కుంబనాథ్ ప్రాంతానికి చెందిన మాథ్యూ ఇరవై ఏళ్ల వయసులో ఉద్యోగం నిమిత్తం కువైట్ వెళ్లారు. నాటి నుంచి ఆయన అక్కడే స్థిరపడిపోయారు.

క్రమంగా పెద్ద వ్యాపారవేత్తగా ఎదిగారు. 1990లో జరిగిన గల్ఫ్ వార్ లో సుమారు 1.50 లక్షల మంది భారతీయులు చిక్కుకుపోయిన సమయంలో వారిని రక్షించడంలో మాథ్యూ కీలకపాత్ర పోషించారు. మాథ్యూని స్ఫూర్తిగా తీసుకుని బాలీవుడ్ లో ‘ఎయిర్ లిఫ్ట్’ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ హీరోగా నటించాడు. మాథ్యూ మృతి చెందడంపై అక్షయ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా సంతాపం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News