: ఎవరికీ తెలియని వ్యక్తిగత విషయాలు నా ‘బయోపిక్’లో ఉన్నాయి: సచిన్


ఎవరికీ తెలియని వ్యక్తిగత విషయాలు తన బయోపిక్ ‘సచిన్: ఏ బిలియన్ డ్రీమ్స్’లో ఉన్నాయని క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అన్నారు. ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు ఈ చిత్రం రానున్న తరుణంలో ఓ న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సచిన్ మాట్లాడుతూ, తనపై బయోపిక్ తీస్తామని అడిగినప్పుడు చేయాలా? వద్దా? అని మొదట్లో ఆలోచించానని, అభిమానులు తన గురించి బాగా తెలుసుకోవాలనుకుంటున్నారని తనకు అర్థమైందని చెప్పారు.

ఈ బయోపిక్ లో రీల్ టైమ్ కన్నా రియల్ టైమ్ ఎక్కువని, మొదట్లో కెమెరా ముందు కొంత ఇబ్బంది పడ్డానని, కొన్ని రోజుల్లోనే కెమెరా భయం పోయిందని చెప్పుకొచ్చారు. తనకు సిగ్గు ఎక్కువే కానీ, బాగా, మేనేజ్ చేశానని, ఈ బయోపిక్ లో తన జీవితాన్ని పూర్తిగా ఆవిష్కరించానని, ఈ చిత్రం చూసిన తన అభిమానులు పూర్తి సంతృప్తి చెందుతారని, మిగిలిన బయోపిక్స్ తో తన బయోపిక్ ను పోల్చుతారని అనుకోనని చెప్పిన సచిన్, ఇప్పటి వరకు తన జీవితంలో పెద్దగా దాచింది ఏమీ లేదని అన్నారు.

  • Loading...

More Telugu News