: నారాయణరెడ్డిని హతమార్చింది కేఈ కుటుంబీకులే!: సోదరుడు ప్రదీప్ రెడ్డి ఆరోపణ


పత్తికొండ వైఎస్సార్సీపీ ఇన్ చార్జి నారాయణరెడ్డిని హత మార్చింది డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి కుటుంబీకులేనని నారాయణరెడ్డి సోదరుడు ప్రదీప్ రెడ్డి ఆరోపించారు. ఈ కేసుపై పోలీసులు సమగ్ర విచారణ నిర్వహించాలని, దోషులను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా, చెరుకులపాడులో నారాయణరెడ్డి అంత్యక్రియలు రేపు నిర్వహించనున్నారు. వైఎస్సార్సీపీ అధినేత జగన్, ఆ పార్టీ ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు.

  • Loading...

More Telugu News