: ఛీఛీ... ఇది కుక్కకు పెట్టే తిండిలా ఉంది... ప్రియాంకా చోప్రా వంటపై సెలబ్రిటీ షెఫ్ మండిపాటు


ప్రస్తుతం హాలీవుడ్ ప్రాజక్టులతో బిజీగా మారి, లాస్ ఏంజిలెస్ లో ఉంటున్న ప్రియాంకా చోప్రాకు ఊహించని షాక్ తగిలింది. ఇటీవల ఒక టీవీ టాక్ షోలో ఈ చిన్నది పాల్గొంది. వంటలు వచ్చా? అంటూ ఈ షోలో ప్రియాంకను అడిగితే ... భారతీయ వంటలు చేయడం తెలుసని తెలిపింది. దీంతో ఆ షో నిర్వాహకులు వెంటనే ఒక వంట చేయమనడంతో సరదాగా కిచిడీ, చికెన్ సూప్ చేసింది. ఆ వంటలను ఎవరైనా భారతీయ సెలబ్రిటీ షెఫ్ తిని ఉంటే... ఆనందంతో గంతులేసి...అద్భుతం అని పొగిడేవాడే... కానీ బ్రిటిష్ సెలెబ్రటీ షెఫ్ జోర్డన్‌ రామ్సే మాత్రం అలా చేయలేదు.

వంటలు చేయడంలో దిట్ట అయిన రామ్సే.. ప్రియాంక వంటను చెత్తతో పోల్చాడు. దానిని రుచి చూసిన వెంటనే 'చీఛీ!...ఇదేం వంట...దీనిని కుక్కలు కూడా తినవు' అన్నాడు.... ఇంత నిర్మొహమాటంగా ప్రియాంక వంటను చీల్చిచెండాడం ఆమె అభిమానులకు నచ్చలేదు. దీంతో అతనిపై ఆమె అభిమానులు విరుచుకుపడుతున్నారు.  

  • Loading...

More Telugu News