: అక్టోబర్ 6న సమంత, నాగచైతన్యల వివాహం... సోషల్ మీడియాలో వైరల్
ప్రముఖ యువనటులు నాగచైతన్య, సమంతల వివాహంపై సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతోంది. ఎంగేజ్ మెట్ పూర్తి చేసుకున్న ఈ యువజంట వివాహానికి ముహూర్తం ఖరారైందని, అక్టోబర్ 6న వివాహంతో వీరిద్దరూ దంపతులు కానున్నారని వార్త వైరల్ అవుతుండగా, దీనిపై అధికారికంగా ఆ నటీనటులిద్దరూ స్పందించలేదు. కాగా, 'రారండోయ్ వేడుక చూద్దాం' సినిమా ప్రమోషన్ సందర్భంగా నాగచైతన్య మాట్లాడుతూ, తమ వివాహం అక్టోబర్ రెండు లేదా మూడో వారంలో ఉంటుందని తెలిపాడు. డేట్ ఇంకా అనుకోలేదని చెప్పాడు.