: చంద్రబాబు, కేఈలే పథకం ప్రకారం ఈ హత్య చేయించారు: వైఎస్సార్సీపీ ఆరోపణ


కర్నూలు జిల్లా పత్తికొండ వైఎస్సార్సీపీ ఇన్ ఛార్జి నారాయణరెడ్డి హత్యను తాము తీవ్రంగా పరిగణిస్తున్నామని వైఎస్సార్సీపీ ఓ ప్రకటనలో పేర్కొంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం కేఈలే పథకం ప్రకారం ఈ హత్య చేయించారని, ప్రజల  మనసులను గెలుచుకోవడం టీడీపీకి చేతగావడం లేదని, గత మూడేళ్ల టీడీపీ అరాచకపాలనకు ఇది పరాకాష్ట అని మండిపడింది. హత్యా రాజకీయాలకు టీడీపీ తెరలేపిందని, భయానక వాతావరణం సృష్టించి, హత్యలు చేయించి ప్రతిపక్షం నోరు మూయించేందుకు టీడీపీ సర్కార్ బరితెగించిందని వైఎస్సార్సీపీ ఆరోపించింది. నారాయణరెడ్డి హత్యతో ఏపీ రాక్షస పాలన ఉగ్రవాద స్థాయికి చేరిందని, ఈ హత్యకు నిరసనగా రేపు కర్నూలు జిల్లా బంద్ కు పిలుపునిస్తున్నట్టు ఆ ప్రకటనలో తెలిపింది.

  • Loading...

More Telugu News