: అ, ఆలకు కొత్త అర్థాలను మనవడితో రాయించిన చంద్రబాబు!
సీఎం నారా చంద్రబాబు మనవడు, లోకేష్ తనయుడు దేవాన్ష్ కు తిరుమలలో ఈ రోజు అక్షరాభ్యాసం చేయించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, ‘దేవాన్ష్ కు అన్నప్రాసన, అక్షరాభ్యాసం తిరుమలలోనే చేయించాం. అ అంటే అమ్మ, అమరావతి, ఆ అంటే ఆంధ్రప్రదేశ్, ఆరోగ్యం, ఆదాయం అని దేవాన్ష్ తో రాయించి నూతన సంప్రదాయానికి అంకురార్పణ చేయించాం’ అని చెప్పారు. ఈ సందర్భంగా టీటీడీ పాలకమండలి నియామకం త్వరలోనే జరుగుతుందని, తిరుపతిని ప్రపంచంలోనే నెంబర్ వన్ గా సిటీగా తీర్చిదిద్దుతామని చంద్రబాబు చెప్పారు.