: విజయవాడలో దారుణం... ఫేస్ బుక్ పరిచయంతో గ్యాంగ్ రేప్ కు గురైంది


కృష్ణా జిల్లా విజయవాడలో దారుణం చోటుచేసుకుంది. ఫేస్ బుక్ పరిచయం ఒక యువతికి నరకాన్ని పరిచయం చేసింది. ఘటన వివరాల్లోకి వెళ్తే... విజయవాడకు చెందిన బీటెక్ యువతికి శ్రీకాంత్ అనే యువకుడు ఫేస్ బుక్ లో పరిచయమయ్యాడు. తరువాత ఈ పరిచయం మరింతగా పెరగడంతో, వ్యక్తిగత ఫోన్ నెంబర్లు మార్చుకున్నారు. తరువాత వాట్స్ యాప్, ఛాటింగులు, గంటల తరబడి కబుర్లు... కాలమే తెలియలేదు. ఈ పరిచయం మరింత లోతుకు వెళ్లడంతో ఆమెను శ్రీకాంత్ తన స్నేహితుల రూంకి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెకు కూల్ డ్రింక్ లో మత్తుమందు ఇచ్చి, సామూహిక అత్యాచారాని (గ్యాంగ్ రేప్)కి పాల్పడ్డారు. అనంతరం ఇంటికి చేరిన యువతి, జరిగిన దారుణాన్ని తల్లిదండ్రులకు వివరించడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించి, నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

  • Loading...

More Telugu News