: రాజమౌళిని కూడా వదలని రాంగోపాల్ వర్మ... ఆసక్తికర ట్వీట్


ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మను బాహుబలి సినిమా పూనినట్టుంది. 'బాహుబలి-2: ద కన్ క్లూజన్' సినిమా విడుదలైన నాటి నుంచి ఆ సినిమాపై ట్వీట్లతో ప్రశంసలు కురిపిస్తున్నాడు. ఒక విధంగా చెప్పాలంటే, తన 'సర్కార్-3' సినిమా కంటే కూడా రాంగోపాల్ వర్మ 'బాహుబలి-2: ద కన్ క్లూజన్' సినిమాపైనే ఎక్కువ మాట్లాడాడంటే ఆశ్చర్యం కలగకమానదు. 'బాహుబలి-2: ద కన్ క్లూజన్' సినిమాను ఇంతగా పొగిడిన రాంగోపాల్ వర్మ, రాజమౌళిని పొగిడాడో తెగిడాడో అర్ధం కాని విధంగా ఒక ట్వీట్ చేశాడు. 'బాహుబలి-2: ద కన్ క్లూజన్' మేనియా నుంచి బయటకు వచ్చిన రాంగోపాల్ వర్మ తాజాగా...‘'బాహుబలి-2: ద కన్ క్లూజన్' సినిమా కలెక్షన్ల కంటే కూడా రాజమౌళి నమ్రత, విధేయతలే భయానకంగా అనిపిస్తాయి’ అంటూ వ్యాఖ్యానించాడు. కాగా, రాజమౌళి బహిరంగ వేదికలపై వినమ్రత, విధేయత చూపిస్తూ మాట్లాడుతాడన్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News