: ఎండలకు మండుతున్న ప్రాణాలు!
రోహిణి కార్తె ప్రవేశానికి ముందే తెలుగు రాష్ట్రాలను భానుడి భగభగలు మండిస్తున్నాయి. ఎండల ధాటికి పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. ఎండవేడిమికి తాళడం కష్టంగా ఉంటోంది. తెలుగు రాష్ట్రాల్లో 47 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా 30 డిగ్రీలపైనే నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎండవేడిమి, ఉక్కపోతను భరించలేకపోతున్నారు. దీంతో నిన్న ఒక్క రోజే తెలంగాణలో 29 మంది ప్రాణాలు కోల్పోయారు. ఏపీలో మృతుల సంఖ్య తెలియాల్సి ఉంది. దీంతో తెలుగు రాష్ట్రాల ప్రజల పరిస్థితి కుక్కర్లో పెట్టి ఉడికించినట్టుంది.