: శభాష్ తల్లీ! ఆ కీచకుడికి తగిన శాస్తి చేశావ్!: యువతికి కేరళ సీఎం ప్రశంస
ఆధ్యాత్మిక ముసుగు వేసుకుని గత ఎనిమిదేళ్లుగా అత్యాచారానికి పాల్పడుతున్న మృగాడికి తగిన శాస్తి చేసిన యువతిని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అభినందించారు. ‘ఆమె ఎంతో ధైర్యంగా మంచి పని చేసింది.. అందులో ఎటువంటి అనుమానం లేదని’ ఆయన ప్రశంసించారు. కాగా, కొల్లమ్ లోని పన్మన ఆశ్రమానికి చెందిన స్వామి గణేశానంద తనను భక్తితో కొలుచుకుంటున్న కుటుంబానికి చెందిన యువతిపై అత్యాచారానికి ఒడిగడుతుండగా, అతని దాష్టీకాన్ని భరించలేని యువతి ఎదురుతిరిగి అతని జననాంగాన్ని కోసేసిన సంగతి తెలిసిందే. అనంతరం ధైర్యంగా తాను చేసిన పనిని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఆ స్వామీజీ తమ ఆశ్రమం నుంచి 15 ఏళ్ల క్రితమే వెళ్లిపోయారని పన్మన ఆశ్రమం చెబుతోంది.