: లిబియాలో సైనిక దాడి.. 141 మంది మృతి.. చనిపోయిన వారిలో పలువురు సాధారణ పౌరులు!


లిబియాలో జరిగిన సైనిక దాడిలో 141 మంది మృతి చెందారు. వీరిలో పలువురు సాధారణ పౌరులు కూడా ఉన్నారు. తిరుగుబాటు నేతల అధీనంలో ఉన్న బ్రాక్ అల్ షత్ ఎయిర్‌బేస్‌పై సైన్యం బాంబుల వర్షం కురిపించింది. లిబియా నేషనల్ ఆర్మీకి తనను తాను సైనికాధికారిగా ప్రకటించుకున్న ఖలీఫా హఫ్తార్‌కి మద్దతిస్తున్న వారిలో ఎక్కువ మంది ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయారు. ఐక్యరాజ్యసమితి మద్దతిస్తున్న ప్రభుత్వ నేతృత్వంలోని దళాలే ఈ ఎయిర్‌బేస్‌పై దాడులు నిర్వహించినట్టు తెలుస్తోంది. మరోవైపు ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో జరిగిన రెండు కారుబాంబు పేలుళ్లలో 35 మంది మృతి చెందారు. ఈ దాడులకు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రసంస్థ బాధ్యత ప్రకటించింది.

  • Loading...

More Telugu News