: ఆ ఫొటోనే కాదు.. అందులోని బ్యూటిఫుల్ లేడీ కూడా బాగా నచ్చింది: అభిషేక్ బచ్చన్


‘ఈ ఫొటోనే కాదు.. అందులోని బ్యూటిఫుల్ లేడీ కూడా బాగా నచ్చింది’ అని పేర్కొంటూ బాలీవుడ్‌ నటుడు అభిషేక్‌ బచ్చన్ త‌న శ్రీ‌మ‌తి ఐశ్వ‌ర్య రాయ్‌ ఫొటోను ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్ట్ చేసి అభిమానుల‌ను అల‌రించాడు. కేన్స్ వేడుక‌ల్లో పాల్గొన్న ఐశ్వ‌ర్య‌ రాయ్‌ నిన్న‌ రాత్రి పౌడర్‌ బ్లూ కలర్‌ గౌను ధరించి ఎర్రతివాచీపై న‌డిచి ప్రేక్ష‌కుల‌ను మైమ‌రపించిన విష‌యం తెలిసిందే. ఆమె అందం ముందు ఎవ్వ‌రూ ప‌నికిరారంటూ ఆమె అభిమానులు కూడా ట్వీట్లు చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే అభిషేక్ త‌న భార్య ఫొటోను పోస్ట్ చేసి ఇలా పేర్కొన్నాడు. కేన్స్ వేడుక‌ల నిర్వాహ‌కులు ఐశ్వ‌ర్య‌రాయ్‌కి ప్ర‌తీసారి ఆహ్వానం అందిస్తారు. ఆమె ఈ ఉత్సవాల్లో 16వ సారి పాల్గొంది.

  • Loading...

More Telugu News