: మోదీని జగన్ కలిస్తే టీడీపీకి ఎందుకంత ఉలుకు?: ఉండవల్లి అరుణ్‌కుమార్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి కలిసిన అంశంపై టీడీపీ నేతలు విమర్శలు చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ విషయంపై స్పందించిన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్.. మోదీని జగన్ కలిస్తే టీడీపీకి ఎందుకంత ఉలుకు? అని ప్రశ్నించారు. జగన్‌పై పెట్టిన కేసులు నిలబడబోవని ఆయన జోస్యం చెప్పారు. రాష్ట్ర సర్కారు విభజన చట్టంలోని 108 యాక్టుపై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. లేకపోతే వచ్చేనెల 1 తర్వాత ఆ యాక్ట్ భ్రష్టు పడుతుందని ఆయన అన్నారు. విభజన చట్టంలోని అంశాలను పొడిగించాలని సీఎం చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారని, అయితే, ముందుగా ఎన్ని అమలయ్యాయో శ్వేతపత్రం విడుదల చేయాలని ఉండవల్లి డిమాండ్ చేశారు.