: అత్యాచారానికి యత్నించిన బాబా కొత్త వాదన!
తనపై అత్యాచారానికి యత్నించిన ఓ దొంగ బాబాకు బుద్ధి చెబుతూ ఓ కేరళ యువతి అతడి జననాంగాన్ని కోసేసిన ఘటన సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఆ రాష్ట్రంలోని కోళ్లామ్ లోని పద్మనలో గణేషానంద తీర్థపద స్వామి (54) అలియాస్ హరి ఆశ్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రస్తుతం ఆ బాబా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. ఈ సందర్భంగా పోలీసులతో వివరాలు చెబుతూ.. తన జననాంగాన్ని ఆ విద్యార్థిని కోయలేదని, తనకు తానే కోసేసుకున్నానని అన్నాడు. ఈ కేసులో పోలీసులకి మరో విషయం కూడా తెలిసింది. ఆ స్వామి గత ఏడేళ్లుగా ఆ యువతిపై తరచూ అత్యాచారం చేస్తున్నాడని పోలీసులు తెలుసుకున్నారు. అందుకే ఆ యువతి విసుగు చెంది ఈ పని చేసిందని చెప్పారు. ఈ స్వామి తన ఆశ్రమంలో 15 ఏళ్లుగా తన కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు. అంతకుముందు ఎర్నాకులం జిల్లా కొల్లెంచెరి ప్రాంతంలో ఒక టీ స్టాల్ నడుపుకొనేవాడు.