: వారి ప్రేమ, ఆప్యాయతలకు ఉబ్బితబ్బిబ్బయ్యా: హీరో మాధవన్
చెన్నైలోని ఎంవోపీ వైష్ణవ్ కళాశాలలో ఇటీవల జరిగిన వార్షికోత్సవ వేడుకలకు ప్రత్యేక అతిథిగా దక్షిణాది నటుడు మాధవన్ హాజరయ్యాడు. మాధవన్ ను చూసిన విద్యార్థినులు ఒక్కసారిగా ఆయన్ని చుట్టుముట్టేశారు. ఈ సంఘటన గురించి మాధవన్ ప్రస్తావిస్తూ, వారి ప్రేమ, ఆప్యాయతలకు ఉబ్బితబ్బిబ్బయ్యానని చెప్పాడు. వారు చూపించిన ప్రేమను మరువలేనని, ఇటువంటి సంఘటనలు తరచుగా తనకు ఎదురవుతుంటాయని, వారు చూపించే ప్రేమను కాదనలేమని అన్నాడు.