: 'అమ్మడు లెట్స్ డు కుమ్ముడు..' పాటకి స్టెప్పులేసిన క్రికెటర్లు.. మీరూ చూడండి
ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ సీజన్‌లో అద్భుతంగా రాణించినప్పటికీ ఫైనల్‌కు చేరుకోలేకపోయిన సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ క్రికెటర్లు ఇక ఇంటి బాటపట్టిన విషయం తెలిసిందే. అయితే, ప్రస్తుతం భారత్‌లోనే ఉన్న ఆ క్రికెటర్లు పలు ప్రదేశాల్లో ఎంజాయ్ చేస్తూ కనిపిస్తున్నారు. తాజాగా ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొని తెలుగు, హిందీ సినిమాల పాటలకు స్టెప్పులు వేసి అలరించారు. చిరంజీవి ఖైదీ 150 సినిమాలోని అమ్మడు .. లెట్స్ డు కుమ్ముడు పాటకి హెన్సిక్స్ అచ్చం చిరులాగే స్టెప్స్ వేయాలని ప్రయత్నించాడు. ఇక శిఖర్ దావన్ సల్మాన్ పాటకి, పవన్ కల్యాణ్ గబ్బర్ సింగ్ పాటకి విలియమ్ సన్, అల్లు అర్జున్ పాటకి మెక్ గ్లీన్ డ్యాన్స్ చేశారు. ఆఖరుకి అందరూ కలిసి విక్టరీ వెంకటేశ్ గురు సినిమాలోని జింగిడి జింగిడీ పాటకు స్టెప్పులేసి అలరించారు. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాద్యమాల్లో హల్‌చల్ చేస్తోంది.. మీరూ చూడండి..
Sunrisers Hyderabad team dancing video by anudeepbairi1