: నేను ఏ పార్టీలోకి వెళ్లను..టీడీపీలోనే ఉంటా: రేవంత్ రెడ్డి
తాను ఏ పార్టీలోకి వెళ్లనని, టీడీపీలోనే ఉంటానని తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో టీడీపీని గెలిపిస్తానని అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ డిప్యూటీ సీఎం వియ్యంకుడిపై ఆయన ఆరోపణలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా గుట్కాల నిషేధం ఉన్నా, డిప్యూటీ సీఎం వియ్యంకుడు గుట్కాలు విక్రయిస్తున్నారని, అయినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు.