: 52 డిగ్రీలకు వెళ్లనున్న తూర్పుగోదావరి జిల్లా ఉష్ణోగ్రతలు!
ప్రకృతి అందానికి నిలయమైన తూర్పుగోదావరి జిల్లాలో భానుడు నిప్పులు చెరుగుతున్నాడు. రానున్న మూడు, నాలుగు రోజుల పాటు జిల్లాలో ఉష్ణోగ్రతలు మండిపోనున్నాయట. ఈ విషయాన్ని స్వయంగా ఇస్రో అధికారులు వెల్లడించారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ కార్తికేయ కూడా ద్రువీకరించారు. జిల్లాలో ఉష్ణోగ్రతలు 52 డిగ్రీల వరకు వెళ్లే అవకాశం ఉందని ఇస్రో హెచ్చరించినట్టు ఆయన తెలిపారు. ముఖ్యంగా కోనసీమలోని అమలాపురం, కాట్రేనికోన, ఉప్పలగుప్తం మండలాలతో పాటు కాకినాడ సమీపంలో ఉండే ఉప్పాడ, కొత్తపల్లి మండలాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని చెప్పారు. ఈ నేపథ్యంలో, ప్రజలంతా చాలా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వీలైనంత వరకు ఇంటి నుంచి బయటకు రాకుండా ఉండాలని తెలిపారు.