: ఎస్ఐని నిర్బంధించారనే ఆరోపణలపై.. టీడీపీ ఎమ్మెల్యే రాధాకృష్ణపై కేసు నమోదు
పశ్చిమగోదావరి జిల్లా తణుకు టీడీపీ ఎమ్మెల్యే అరమిల్లి రాధాకృష్ణపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనతో పాటు మరో 8 మందిపై తణుకు రూరల్ పీఎస్ లో కేసు నమోదైంది. ఐపీసీ 341, 342, 353 సెక్షన్ల కింద వీరిపై కేసు బుక్ చేశారు. రెండు రోజుల క్రితం ఎస్ఐ, రైటర్లను వీరు నిర్బంధించారనే నేపథ్యంలో కేసు నమోదు చేశారు. ఇంటికి పిలిపించి వీరిని నిర్బంధించినట్టు ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. దీనికి సంబంధించి ఇరగవరం ఎస్ఐ శ్రీనివాస్ తణుకు రూరల్ పీఎస్ లో ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యేపై పెట్టిన సెక్షన్లు బెయిలబుల్ కావడంతో, ఎమ్మెల్యేకు స్టేషన్ బెయిల్ ఇచ్చే అవకాశం ఉంది.