: 24న వామపక్షాలు చేపట్టే బంద్ కు మద్దతు ఇస్తున్నాం: రఘువీరారెడ్డి
ఈ నెల 24న రాయలసీమలో వామపక్షాలు చేపట్టనున్న బంద్ కు మద్దతు ప్రకటిస్తున్నట్టు ఏపీ పీసీసీ నేత రఘువీరారెడ్డి ప్రకటించారు. ‘అబద్ధాల అమిత్ షా గో బ్యాక్.. మోసకారి మోదీ గో బ్యాక్’ నినాదంతో 25వ తేదీన అన్ని జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు చేపడతామని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని, ఏపీకి ప్రత్యేక హోదా విషయమై మద్దతు ఇచ్చిన 14 పార్టీలను ఆహ్వానించే నిమిత్తం ఈ నెల 23న ఢిల్లీ వెళ్లనున్నట్టు రఘువీరా చెప్పారు.