: దక్షిణాదిలో పార్టీ బలోపేతంపై ప్రత్యేక దృష్టి పెట్టాం: మంత్రి వెంకయ్యనాయుడు


దక్షిణాదిలో బీజేపీ బలోపేతంపై ప్రత్యేక దృష్టి పెట్టామని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఏపీలో పర్యటిస్తారని, సభలో పాల్గొంటారని అన్నారు. బూత్ స్థాయి కార్యకర్తలతో అమిత్ షా భేటీ అవుతారని, ఆహ్వానం ఉన్న వారిని మాత్రమే సమావేశానికి అనుమతిస్తారని చెప్పారు. దేశంలో ఎన్డీయే మినహా ఇతర పక్షాలన్నీ దిక్కుతోచని స్థితిలో ఉన్నాయని, ప్రతిపక్ష పార్టీలన్నీ మహాకూటమి ఏర్పాటు చేస్తామంటున్నాయని అన్నారు. తమిళనాడు రాజకీయాల్లో కలుగజేసుకోమని, ఏపీలో నియోజకవర్గాల పెంపు అంశం న్యాయ శాఖ పరిధిలో ఉందని అన్నారు. 

  • Loading...

More Telugu News