: అలా చేయకూడదని చెప్పిన జ్యోతిష్యుడు.. సమాధి నుంచి మృతదేహాన్ని వెలికితీసిన గ్రామస్తులు
ఓ జ్యోతిష్యుడు చేసిన సూచన మేరకు ప్రజలు ఏడాదిన్నర క్రితం చనిపోయిన ఓ వ్యక్తి మృతదేహాన్ని సమాధి నుంచి వెలికితీసిన ఘటన కర్ణాటకలోని తుమకూరు జిల్లా చిక్కనాయకనలో చోటు చేసుకుంది. ఆ ప్రాంతంలోని అణెకట్టకు చెందిన మల్లేగౌడ అనే వృద్ధుడు చర్మం క్రమంగా తెల్లగా మారిపోయే 'తొన్ని' అనే వ్యాధితో బాధపడుతూ చనిపోగా అప్పుడు అతని మృతదేహాన్ని ఖననం చేశారు. అయితే, అటువంటి వ్యాధితో బాధపడుతూ మృతిచెందిన వారిని దహనం మాత్రమే చేయాలని, ఖననం చేయకూడదని ఇటీవలే ఆ ఊరికి వచ్చిన ఓ జ్యోతిష్యుడు చెప్పాడు. అలా చేస్తేనే వర్షాభావంతో కొట్టుమిట్టాడుతున్న ఆ గ్రామంలో వర్షాలు పడతాయని చెప్పాడు. దీంతో ఆ వ్యక్తి ఏది చెబితే అది నమ్మేసిన గ్రామస్తులు సమాధి నుంచి ఆ మృతదేహాన్ని వెలికితీసి దహనం చేశారు.