: సౌదీ అరేబియా చేరుకున్న డొనాల్డ్ ట్రంప్
తొలి విదేశీ పర్యటనలో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ రోజు సౌదీ అరేబియా చేరుకున్నారు. రియాద్ విమానాశ్రయంలో ట్రంప్ దంపతులకు ఘన స్వాగతం లభించింది. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదంపై అమెరికా, సౌదీ అరేబియా దేశాలు సరికొత్త నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. కాగా, ఎనిమిది రోజుల పర్యటనలో భాగంగా ఇస్లామ్, క్రైస్తవ, యూదుల పుణ్య క్షేత్రాలను ఆయన సందర్శించనున్నారు. ఇజ్రాయిల్, పాలస్తీనా, బ్రసెల్స్, వాటికన్, సిసిలీ లో ట్రంప్ పర్యటించనున్నారు.