: గొట్టిపాటి ఇంటి వద్ద భద్రత పెంపు!
ప్రకాశం జిల్లాలో నిన్న రాత్రి జరిగిన హత్యల నేపథ్యంలో అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవి కుమార్ ఇంటి వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. గుంటూరు జిల్లాలోని చిలకలూరిపేటలో ఉన్న ఆయన ఇంటి వద్ద కూడా భద్రతను పెంచారు. ఎమ్మెల్సీ కరణం బలరాం అనుచరులను గొట్టిపాటి వర్గీయులే చంపేశారనే ఆరోపణల నేపథ్యంలో, భారీ బందోబస్తు చేశారు. ఎలాంటి గొడవలు జరగకుండా పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం వేమవరం గ్రామంలో 144 సెక్షన్ విధించారు.