: మండుతున్న రెంటచింతల, నరసరావుపేట!
మండుతున్న ఎండలకు ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇంటి నుంచి బయటకు వస్తే... నిప్పుల కొలిమిలోకి వచ్చినట్టుగా ఉంటోంది. ఎండ తీవ్రతకు ప్రజలు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. దీంతో, మధ్యాహ్న వేళల్లో రోడ్లు కర్ఫ్యూను తలపిస్తున్నాయి. ఇరు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గుంటూరు జిల్లా రెంటచింతలలో 49.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నరసరావుపేటలో 49 డిగ్రీలు, తాడికొండలో 46.7, గుంటూరులో 46, బాపట్లలో 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.