: బిజీగా ఉన్నప్పుడు రమ్మంటే ఎలా రాగలను?: హీరోయిన్ రెజీనా


తన అందచందాలతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది హీరోయిన్ రెజీనా. ఆమె నటించిన పలు సినిమాలు హిట్ అయినప్పటికీ... పెద్ద హీరోలతో నటించే అవకాశం మాత్రం ఆమెకు రాలేదు. మరోవైపు టాలీవుడ్ లో ఆమెకు క్రమంగా అవకాశాలు తగ్గిపోయాయి. దీంతో ఆమె తమిళంవైపు దృష్టి సారించింది. ఇప్పుడిప్పుడే అక్కడ బిజి అవుతోంది రెజీనా. ప్రస్తుతం కోలీవుడ్ లో ఐదు సినిమాలను చేస్తున్నానని... త్వరలోనే తమిళ సినీ పరిశ్రమలో మంచి స్థాయికి చేరుకుంటానని ఓ ఇంటర్వ్యూలో రెజీనా ఆత్మవిశ్వాసం వ్యక్తం చేసింది.

సినీ ప్రమోషన్లకు రాదనే బ్యాడ్ టాక్ కూడా రెజీనాపై ఉంది. దీనిపై ఈ ముద్దుగుమ్మను ప్రశ్నించగా... తనకు షూటింగ్ లేకపోతే కచ్చితంగా ప్రమోషన్లకు వస్తానని... వేరే షూటింగ్ లో ఉన్నప్పుడు రమ్మంటే, ఎలా రాగలనని సమాధానమిచ్చింది. దాదాపు అన్ని ప్రమోషన్ ఈవెంట్లకు తాను హాజరయ్యానని... ఎప్పుడైనా ఏదైనా ఒక ఈవెంట్ కు వెళ్లకపోయేసరికి ఇలాంటి కామెంట్లు చేస్తారని చెప్పింది. రానాతో నటించే అవకాశం వస్తే వదులుకోనని తెలిపింది.

  • Loading...

More Telugu News