: ‘జేఈఈ అడ్వాన్స్ డ్’కు హాజరయ్యే విద్యార్థులు పాటించాల్సిన నిబంధనలు!


రేపు జేఈఈ అడ్వాన్స్ డ్ పరీక్షలు జరగనున్నాయి. ఇటీవల నిర్వహించిన ‘నీట్’ ఎంట్రన్స్ లో విధించిన నిబంధనలే జేఈఈ అడ్వాన్స్ డ్ కు హాజరయ్యే విద్యార్థులకు కూడా విధిస్తామన్నారు. ఈ నేపథ్యంలో ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థినీ, విద్యార్థులకు మద్రాసు ఐఐటీ సూచనలు జారీ చేసింది. అమ్మాయిలు చెవులకు రింగులు, ముక్కుపుడకలు, చేతి ఉంగరాలు, బ్రేస్ లెట్లు, హెయిర్ పిన్నులు, హెయిర్ బ్యాండ్స్ ధరించి పరీక్షకు హాజరు కావద్దని సూచించింది. విద్యార్థులు అయితే ఫుల్ హ్యాండ్స్ షర్టు, పెద్ద బటన్స్ ఉన్న చొక్కాలు, షూ ధరించకూడదని, స్లిప్పర్స్ తో రావాలని సూచించారు. ఈ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు హెల్త్ బ్యాండ్స్, మొబైల్, ఇయర్ ఫోన్లతో రావద్దని సూచించారు. పరీక్షల్లో ఎటువంటి అక్రమాలు జరగకుండా ఉండేందుకే ఈ చర్యలు తీసుకున్నామని మద్రాసు ఐఐటీ అధికారులు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News