: ‘కేన్స్’లో ఐశ్వర్యారాయ్ అదరగొట్టింది!
ప్రతిష్టాత్మక కేన్స్ 70వ ఫిల్మ్ ఫెస్టివల్ లో భాగంగా రెడ్ కార్పెట్ పై బాలీవుడ్ అందాల నటి ఐశ్వర్యారాయ్ బచ్చన్ నడిచింది. మైఖేల్ సిన్కో డిజైన్ చేసిన పౌడర్ బ్లూ బ్రొకేడ్ బాల్ గౌన్ లో ఐశ్వర్య అభిమానులను మంత్రముగ్ధులను చేసింది. ఈ సందర్భంగా ఐశ్వర్యపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అంతకు ముందు కేన్స్ ఫొటో షూట్ లో ఆకుపచ్చని డ్రెస్ లోనూ ఐశ్వర్య ఆకట్టుకుంది. కాగా, కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో తొలి రోజున బాలీవుడ్ తారలు దీపికా పదుకొణె, మల్లికాషెరావత్, రెండో రోజున దక్షిణాది ముద్దుగుమ్మ శ్రుతిహాస్ లు రెడ్ కార్పెట్ పై సందడి చేశారు. మూడోరోజున ఐష్ పాల్గొంది. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఐశ్వర్య పాల్గొనడం ఇది పదహారవ సారి కావడం విశేషం.