: శ్రీవారి సేవలో సినీ నటి సమంత!
తిరుమల శ్రీవారిని సినీ నటి సమంత దర్శించుకుంది. ఈ రోజు ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామి వారి సేవలో పాల్గొంది. అనంతరం, ఆలయం బయటకు వచ్చిన సమంతను చూసేందుకు భక్తులు ఆసక్తి చూపుతారు. ఈ క్రమంలో స్వల్ప తోపులాట జరిగింది. కాగా, ఈ రోజు స్వామి వారిని దర్శించుకున్న ప్రముఖులలో తెలుగు రాష్ట్రాల ఎన్నికల అధికారి భన్వర్ లాల్, ఏపీ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, సీఎం చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి సతీష్ చంద్ర ఉన్నారు.