: తెలుగు రాష్ట్రాలు మరో 5 రోజుల పాటు నిప్పుల కుంపటే!
భానుడి భగభగలతో ఇరు తెలుగు రాష్ట్రాలు నిప్పుల కొలిమిలా మారాయి. ఉదయం ఏడు దాటితే చాలు రోడ్డు మీదకు రావాలంటేనే భయం వేస్తోంది. మరో ఐదు రోజులపాటు వాతావరణం ఇదే విధంగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రెండు రాష్ట్రాల్లో పలు చోట్ల 45 నుంచి 47 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని... వడగాల్పులు వీస్తాయని హెచ్చరించారు. పలు చోట్ల సాధారణం కంటే 4 నుంచి 6 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని చెప్పారు. ఉదయం 9 గంటల నుంచే వడగాల్పుల ప్రభావం పెరుగుతోందని... దీంతో వడదెబ్బకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వెల్లడించారు. ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు అనవసరంగా ఎండలోకి రావద్దని, అత్యవసరమైన పనులు ఉంటేనే రావాలని వైద్యులు సూచిస్తున్నారు.