: శంషాబాద్ ఎయిర్ పోర్టులో 10 అడుగుల భారీ పాము కలకలం


హైదరాబాదులోని శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఓ పాము కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే, రన్ వే పై ఆగి ఉన్న విమానం వద్ద విమాన సిబ్బంది పామును గుర్తించారు. ఈ పాము ఏకంగా పది అడుగుల పొడవు ఉండటంతో అక్కడున్నవారికి ముచ్చెమటలు పట్టాయి. వెంటనే ఎయిర్ పోర్ట్ సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో విమానాశ్రయ సిబ్బంది పాములు పట్టే వేటగాళ్లను పిలిపించారు. వారు వచ్చి పామును పట్టుకుని, సురక్షిత ప్రాంతంలో వదిలేశారు. పాము విషయం తెలుసుకున్న ప్రయాణికులు కాసేపు భయాందోళనలకు గురయ్యారు.

  • Loading...

More Telugu News