: కాంగ్రెస్ నాయకులను బీజేపీలో చేర్చుకుంటాం, కానీ, బతిమలాడం: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్
కాంగ్రెస్ పార్టీ లో ఉన్న నిజాయతీపరులను, నమ్మకస్తులను బీజేపీలోకి చేర్చుకుంటామని, అంతమాత్రం చేత వాళ్ల కాళ్లు పట్టుకుని బతిమలాడమని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కె. లక్ష్మణ్ అన్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలంగాణ పర్యటనకు రానున్న నేపథ్యంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, తెలంగాణలో భవిష్యత్తులో బీజేపీ అధికారంలోకి వస్తుందని, ఆ వరుసలో ముందున్న రాష్ట్రం ఇదని అన్నారు. మూడు రోజుల అమిత్ షా పర్యటనలో పలు అంశాలను ఆయనకు వివరిస్తామన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆరు నెలల ముందుగానే అభ్యర్థులను ప్రకటించే ప్రయత్నం చేస్తామన్నారు.