: అంతర్జాతీయ న్యాయస్థానంలో కుల్‌భూషణ్ జాదవ్ కేసును ఎదుర్కునేందుకు పాక్ మరో ప్రయత్నం
భారత నేవీ మాజీ అధికారి కుల్‌భూషణ్ జాదవ్‌కు పాకిస్థాన్ ఆర్మీ కోర్టు విధించిన ఉరిశిక్ష తీర్పును విచారించిన అంతర్జాతీయ న్యాయస్థానం ఆ తీర్పుపై స్టే విధించి, భారత దౌత్య అధికారులు కుల్‌భూషణ్ జాదవ్ ను కలుసుకునే అవకాశం కూడా ఇవ్వాలని మధ్యంతర తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. అయితే, పాక్ తీరు ఇంకా మారలేదు. తాము చేసిందే సరైందని భావిస్తోన్న పాకిస్థాన్... ఈ కేసును ఎదుర్కొనేందుకు ప్రత్యేకంగా న్యాయవాదులతో కలిపి ఓ టీమ్‌ను ఏర్పాటు చేసింది.
ఈ దేశ ప్రధాని నవాజ్ షరీఫ్ విదేశీ వ్యవహారాల సలహాదారు సర్తాజ్ అజీజ్ ఈ విషయంపై మాట్లాడుతూ.. అంతర్జాతీయ న్యాయస్థానం ఎదుట తమ దేశం తరఫున ఈ కేసును గట్టిగా వినిపించేందుకు ఆ టీమ్ ప్రయత్నిస్తుందని చెప్పారు. అంతర్జాతీయ న్యాయస్థానం నుంచి వచ్చిన తీర్పును సమీక్షించేందుకు తాము అన్ని ప్రభుత్వ సంస్థలు, ఏజెన్సీల నుంచి సలహాలు తీసుకుంటామని తెలిపారు.